News April 1, 2025

నిర్మల్: వ్యవసాయ శాఖ అధికారుల కొత్త ఫోన్ నంబర్లు ఇవే

image

నిర్మల్ జిల్లా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న డీఏవో, ఏడీఏ, ఏవోల ఫోన్ నంబర్లు నేటి నుంచి మారనున్నాయి. కొత్తగా ఎయిర్ టెల్ నెట్‌వర్క్ సిమ్‌లను సంబంధిత అధికారులకు అందజేశారు. ఇదివరకు ఉన్న ఫోన్ నంబర్లు పనిచేయవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ తెలిపారు. రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే కొత్త నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. పై ఫొటోలో నంబర్లు చూడొచ్చు.

Similar News

News October 30, 2025

కొండపర్తిలో విషాదం.. గోడ కూలి నిద్రలోనే మహిళ మృతి

image

HNK జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలోని ఎస్సీ కాలనీలో దుర్ఘటన చోటుచేసుకుంది. గద్దల సూరమ్మ(60) అనే మహిళ ఇంటి గోడ కూలిపోవడంతో మంచంలో నిద్రిస్తుండగానే మట్టి కుప్పల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందింది. ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి రాకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News October 30, 2025

నెల్లూరు: ఒక్కో హెక్టార్‌కు రూ.25వేల పరిహారం

image

తుపాను ధాటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 42 హెక్టార్లలో ఉద్యానపంటలకు నష్టం వాటిల్లిందని ఆ శాఖ జిల్లా అధికారి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాలు రూపొందించినట్లు చెప్పారు. దెబ్బతిన్న కూరగాయలు, బొప్పాయి పంటలకు హెక్టారుకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో పరిశీలించి ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.

News October 30, 2025

అన్నమయ్య‌ జిల్లాలో భూగర్భ‌ జలాల పెరుగుదల: కలెక్టర్

image

ఈ నెలలో అన్నమయ్య జిల్లాలో 3.4 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినందుకు నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమంలో 9, 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. భవిష్యత్‌లో వచ్చే తుఫానులకు సిద్ధంగా NOP సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.