News February 16, 2025

నిర్మల్: శెభాష్.. సాయి సహస్ర

image

నిర్మల్‌లో నిర్మించిన చేపల మార్కెట్‌ నిరుపయోగంగా ఉంటోంది..రోడ్డుపైనే విక్రయిస్తుంటే ప్రజలు కొంటున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది..ఇది గమనించిన చిన్నారి సాయిసహస్ర నేరుగా కలెక్టర్ దగ్గరకు వెళ్లింది. మార్కెట్ అందుబాటులోకి రాక పడుతున్న ఇబ్బందులు ఆమె దృష్టికి తీసుకెళ్లింది. సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చింది. బాలిక ధైర్యంగా కలెక్టర్ దగ్గరకు వెళ్లడంతో ప్రజలు అభినందిస్తున్నారు.

Similar News

News March 28, 2025

శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

image

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 5వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస, టెక్కలి, శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్‌ల నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు ఏప్రిల్ సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరతాయని వివరించారు.

News March 28, 2025

పాడేరు: మీకోసం కార్యక్రమానికి 115 ఫిర్యాదులు

image

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 115 ఫిర్యాదులు అందాయి. జేసీ అభిషేక్, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్‌తో కలిసి కలెక్టర్ దినేశ్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News March 28, 2025

45 రోజులు, 4 కేసులు.. సిద్ధార్థ్ లూథ్రాకు రూ.2.86 కోట్లు: వైసీపీ

image

AP: కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్మును టీడీపీ లాయర్లకు దోచిపెడుతోందని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు మిత్రుడు సిద్ధార్థ్ లూథ్రాకు ఫీజు రూపంలో రూ.2.86 కోట్లను చెల్లించిందని మండిపడ్డారు. ఇది కేవలం 2024 జులై 16 నుంచి అక్టోబర్ 1 మధ్య 45 రోజుల్లో 4 కేసులకు చెల్లించిన మొత్తమని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన జీవోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

error: Content is protected !!