News March 21, 2025

నిర్మల్: ‘సర్టిఫికెట్ కోర్సును సద్వినియోగం చేసుకోండి’

image

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 30 రోజుల సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆంగ్ల కవిత్వం ద్వారా జీవన నైపుణ్యాన్ని నేర్పనున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ డా.గంగాధర్ తెలిపారు. కోర్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంగ్ల విభాగాధిపతి సుభాష్, అధ్యాపకులు డా.రజిత, రమేశ్ రెడ్డి, సూర్య సాగర్, అర్చన, శ్రీవారి, ఉమెశ్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 18, 2025

తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ లభ్యం

image

తుర్కపల్లి మండలం రుస్తాపురం సమీపంలోని చోక్లా తండాలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను పోలీసులు గుర్తించి, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. బస్వాపూర్ ప్రాజెక్టు పనుల కోసం మధ్యప్రదేశ్, బిహార్ నుంచి వచ్చిన కూలీల పిల్లలు గురువారం ఉదయం తప్పిపోయారు. తల్లిదండ్రులు తుర్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, కొద్దిసేపటికే చిన్నారుల ఆచూకీ గుర్తించారు.

News September 18, 2025

జనగామ జిల్లాలో నిరుద్యోగుల నిరీక్షణ!

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తామని చెప్పిన రాజీవ్ యువ వికాసం పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా రూ.50వేల యూనిట్లను కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం నెలలు గడుస్తున్నా యూనిట్లు కేటాయించకపోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. జనగామ జిల్లాలో 32వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో యువత ఆశలు సన్నగిల్లుతున్నాయి.

News September 18, 2025

అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదు: మంత్రి

image

AP: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని శాసనమండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదని, నోటీసులు అందిన వారికి 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తిచేయాలని వైద్యశాఖకు చెప్పామన్నారు. లబ్ధిదారులు చనిపోతే వారి ఫ్యామిలీలో మరొకరికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. 50-59 ఏళ్ల వయసున్న వారిలో 11.98 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని చెప్పారు.