News March 21, 2025
నిర్మల్: ‘సర్టిఫికెట్ కోర్సును సద్వినియోగం చేసుకోండి’

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 30 రోజుల సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆంగ్ల కవిత్వం ద్వారా జీవన నైపుణ్యాన్ని నేర్పనున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ డా.గంగాధర్ తెలిపారు. కోర్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంగ్ల విభాగాధిపతి సుభాష్, అధ్యాపకులు డా.రజిత, రమేశ్ రెడ్డి, సూర్య సాగర్, అర్చన, శ్రీవారి, ఉమెశ్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 21, 2025
23న పదో తరగతి ఫలితాలు: డీఈవో సలీం

ఈనెల 23న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాష ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలు లీప్ యాప్‌లో పాఠశాల వారీగా కూడా విడుదల చేస్తామని ఆయన వివరించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 110 కేంద్రాల్లో 19,217 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు డీఈవో తెలిపారు.
News April 21, 2025
అగ్నివీర్‌కు ఎంపికైన కొండంరాజపల్లి యువకుడు

నంగునూరు మండలం కొండంరాజపల్లి గ్రామానికి చెందిన తిరుపతి- లక్ష్మీ దంపతుల కుమారుడు బండి శ్రీనివాస్ అగ్నివీర్‌కు ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు కూలీలు కాగా, అగ్నివీర్‌కు ఎంపిక కావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్‌కు బంధువులు, గ్రామస్థులు, మిత్రులు అభినందనలు తెలిపారు.
News April 21, 2025
గిన్నిస్ బుక్ అవార్డు పొందిన సత్తెనపల్లి యువతి

సత్తెనపల్లి యువతికి గిన్నిస్ బుక్ అవార్డ్ దక్కింది. పాపిశెట్టి అనూష 1,046 మంది విద్యార్థులతో గంటపాటు స్వరాలు వాయించినందుకు ఈ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని లైఫ్ చర్చిలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ ఘనత సాధించిన అనూషను పలువురు అభినందిస్తున్నారు.