News February 6, 2025
నిర్మల్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో సుమారు 396 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News February 6, 2025
BREAKING: భారత్ విజయం
ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.
News February 6, 2025
భువనగిరి లాడ్జీల్లో పోలీసుల తనిఖీ
భువనగిరిలోని పలు లాడ్జీలను తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివేరా, డాల్ఫిన్, ఎస్వీ, ఎస్ఆర్ లాడ్జీలను చెక్ చేశామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటున్నారా అని లాడ్జి యాజమాన్యాన్ని ఆరా తీసినట్లు చెప్పారు. MLC ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లైతే తమకు సమాచారం అందించాలన్నారు. సీఐ సురేశ్ కుమార్, ఎస్సైలు లక్ష్మీనారాయణ, కుమారస్వామి పాల్గొన్నారు.
News February 6, 2025
BREAKING: మహబూబ్నగర్ జిల్లాలో MURDER
మహబూబ్నగర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్(36) తరచూ వేధిస్తున్నాడు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్లో ఈరోజు కూడా మళ్లీ ఆమెను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న అబ్దుల్ రహమాన్ తన కూతురిని వేధిస్తావా అంటూ అలీని రాడ్డుతో కొట్టి చంపేశాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.