News April 2, 2025
నిర్మల్: సాంఘిక పరీక్షకు 12 మంది గైర్హాజరు: డీఈవో

ఎలాంటి పొరపాట్లు లేకుండా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా విజయవంతంగా ముగిశాయని డీఈవో రామారావు అన్నారు. బుధవారం తానూర్ మండలం బోసి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. నేడు జరిగిన సాంఘిక పరీక్షకు జిల్లావ్యాప్తంగా 9117 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 12 మంది పరీక్ష రాయలేదని చెప్పారు.
Similar News
News September 15, 2025
ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకున్న కడెం ప్రాజెక్టు

నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న కడెం ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం ఆనాటి ఇంజినీర్ల నైపుణ్యానికి నిదర్శనం. 1949లో నిర్మాణం ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉన్నాయి. 1995, 2022, 2023వ సంవత్సరాల్లో ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద వచ్చినప్పటికీ పటిష్టంగా నిలబడింది. ఇది నాటి ఇంజినీర్ల పనితీరు, దూరదృష్టికి నిలువుటద్దంలా కనిపిస్తోంది.
News September 15, 2025
జగిత్యాల జిల్లాలో యువకుడి దారుణ హత్య

జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట శివారులో ఆదివారం రాత్రి యువకుడి హత్య కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన యువకుడు నహీముద్దీన్ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2025
‘10 లక్షల మంది విద్యార్థులతో HYDలో మహాధర్నా’

నేటి నుంచి ప్రైవేట్ కళాశాలలు నిరవదిక బంద్ చేయనున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు సమ్మె బాట పట్టాయి. ఈ నెల 21, 22న 10 లక్షల విద్యార్థులతో HYDలో మహాధర్నా చేపడతామని, దసరాలోపు రూ.1,200 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సమ్మె విరమిస్తానని విద్యా సంస్థల సంఘాల నాయకులు తేల్చి చెప్పారు.