News March 4, 2025
నిర్మల్: ‘సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి’

యాసంగిలో పంటలకు సాగునీటిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. పలు అంశాలపై జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగిలో సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సాగు చేస్తున్న పంటల విస్తీర్ణానికి సంబంధించి వివరాలను తెలుసుకున్నారు.
Similar News
News March 4, 2025
పేదరిక జిల్లాగా ఉమ్మడి అనంతపురం

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో అనంతపురం జిల్లా 6వ స్థానంలో ఉంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న సోషియో ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రకారం గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. కాగా అత్యంత పేదరిక జిల్లాగా మొదటి స్థానంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నిలిచింది.
News March 4, 2025
తాడ్వాయి: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య

తాడ్వాయి మండలం దేమికాలన్ గ్రామానికి చెందిన బంగారు గళ్ల అభిజిత్(24) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పనిచేయకుండా తిరుగుతున్న అభిజిత్‌ను నానమ్మ పనిచేయాలని చెప్పడంతో మనస్తాపానికి గురైన అభిజిత్ ఈనెల 1న పురుగు మందుతాగాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.
News March 4, 2025
IT బిజినెస్ మోడల్ పనైపోయింది: HCL టెక్ CEO

భారత ఐటీ ఇండస్ట్రీ 30 ఏళ్లుగా అనుసరిస్తున్న సంప్రదాయ బిజినెస్ మోడల్ పనైపోయిందని HCL టెక్ CEO విజయ్ కుమార్ ప్రకటించారు. AI విజృంభణతో ఈ మోడల్ పాతబడిందని పేర్కొన్నారు. భవిష్యత్తుకు తగినట్టు ఉండాలన్నా, మెరుగైన వృద్ధి కావాలన్నా కంపెనీల మైండ్‌సెడ్ మారాలని స్పష్టం చేశారు. AIని వాడుకొని ప్రొడక్షన్ పెంచాలని, సగం ఉద్యోగులతోనే రెట్టింపు రెవెన్యూ సృష్టించాలని తమ టీమ్స్‌ను సవాల్ చేస్తున్నామని తెలిపారు.