News March 4, 2025

నిర్మల్: ‘సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి’

image

యాసంగిలో పంటలకు సాగునీటిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. పలు అంశాలపై జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగిలో సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సాగు చేస్తున్న పంటల విస్తీర్ణానికి సంబంధించి వివరాలను తెలుసుకున్నారు.

Similar News

News April 10, 2026

భద్రాద్రి: తీరని కష్టాలు.. అర్ధరాత్రి డోలీలో గర్భిణి తరలింపు

image

రహదారి సౌకర్యం లేక గర్భిణులు పడుతున్న కష్టాలకు బూర్గంపాడు మండలం చింతకుంట నిదర్శనంగా నిలుస్తోంది. గురువారం రాత్రి మడవి సావిత్రి అనే 7 నెలల గర్భిణికి తీవ్ర అస్వస్థత కలగగా, అంబులెన్స్‌ వచ్చే వీలులేక గ్రామస్థులు ఆమెను డోలీలో 2 కిలోమీటర్లు మోసుకెళ్లారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి గ్రావెల్‌ రోడ్డు నిర్మించాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

News April 10, 2026

మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు: అనకాపల్లి ఎస్పీ

image

వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే యజమానులు, తల్లిదండ్రులపై కేసులు, జరిమానా, జైలు శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలని, సుదూర ప్రయాణాలకు ముందు వాహనం తనిఖీ చేయాలని సూచించారు. అత్యవసర సహాయానికి 100/112, హైవేకు 1033 నంబరును సంప్రదించాలన్నారు.

News April 10, 2026

ఇద్దరు కార్పొరేటర్లపై ఎన్నికల పిటిషన్లు.. నోటీసులు జారీ

image

కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు అభ్యర్థులు అఫిడవిట్ సరిగా ఇవ్వలేదని, అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ జిల్లా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 47, 54వ డివిజన్ నుంచి గెలుపొందిన వారి ఎన్నికలను రద్దు చేయాలని ప్రత్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణకు స్వీకరిస్తూ సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.