News March 14, 2025
నిర్మల్: హంటర్‌కు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు

జిల్లా పోలీస్ శాఖకు విశేష సేవలు అందించిన హంటర్ జాగిలం అనారోగ్యంతో మృతి చెందగా గురువారం రాత్రి జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పలు హత్యలు దొంగతనాల కేసులను ఛేధించడంలో హంటర్ విశేష ప్రతిభను అందించిందని, పోలీసు శాఖకు అందించిన సేవలు వెలకట్టలేవని తెలిపారు.
Similar News
News April 23, 2025
సిద్దరామయ్య, డీకేకు హత్య బెదిరింపులు

కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. వారిని హత్య చేస్తామని బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. వారిద్దరి డెడ్‌బాడీలను ముక్కలుముక్కలుగా నరికి బ్యాగులో కుక్కుతానని బెదిరించారు. ఈ మెయిల్స్ సింధార్ రాజ్‌పుత్ పేరిట వచ్చినట్లు విధానసౌధ పీఎస్ పోలీసులు గుర్తించారు. పోలీసులు FIR నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
News April 23, 2025
వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM

వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. ‘నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా’ అని సీఎం హెచ్చరించారు.
News April 23, 2025
సెల్యూట్: ఉగ్రవాదులతో పోరాడి.. వీర మరణం

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకుని పహల్‌గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుతున్నారు.