News March 6, 2025
నిర్మల్: 100% పన్నులు వసూలు చేయాలి

పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య, ఇంటి పన్ను వసూలు 100% పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సకాలంలో పన్నులు చెల్లించని వారికి చట్ట ప్రకారం రెడ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఇప్పటివరకు వసూలు చేసిన పన్నులు, బకాయిల వివరాలను మున్సిపాలిటీల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 25, 2025
అంత్యక్రియల తర్వాత స్నానం ఎందుకు చేస్తారు?

అంత్యక్రియలు పూర్తయ్యాక అక్కడికి వెళ్లిన వాళ్లందరూ స్నానం చేస్తారు. లేకపోతే ఆత్మలు దేహంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతుంటారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. దహన సంస్కారాల సమయంలో ఆ దేహం నుంచి వచ్చే బ్యాక్టీరియా, అంటువ్యాధులు మనక్కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ అంటురోగాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, కచ్చితంగా స్నానం చేయాలి. అప్పట్లో నదులే స్నానానికి ప్రధాన వనరులు కాబట్టి అక్కడే స్నానమాచరించేవారు.
News November 25, 2025
జనగామ: స్థానిక ఎన్నికలు.. ఆశావహులకు నిరాశే!

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావహులకు నిరాశే మిగిలింది. తొలుత విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం కొంతమంది ఎన్నికలకు పోటీ చేద్దాం అని సిద్ధమయ్యారు. కానీ ఇటీవల విడుదలైన నోటిఫికేషన్లో రిజర్వేషన్లు తారుమారు కావడంతో ముందు ఆశించిన వారు నిరాశ పడ్డారు. కొందరు కొంత మేర డబ్బులు సైతం ఖర్చు పెట్టుకున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
News November 25, 2025
శిశుగృహ ఘటనపై చర్యలు.. ఏడుగురి తొలగింపు?

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శిశుగృహ పసిబిడ్డ మృతి ఘటనకు బాధ్యులైన ఏడుగురిని తొలగిస్తూ అనంతపురం జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. శిశుగృహ మేనేజర్ దీప్తి, సోషల్ వర్కర్, ఏఎన్ఎం, ముగ్గురు ఆయాలు, వాచ్మెన్తో సహా మొత్తం ఏడుగురిని తొలగిస్తూ కలెక్టర్ ఆనంద్ నిర్ణయం తీసుకున్నారు. ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి ఈ విషయాన్ని ధృవీకరించారు. శిశు గృహంలో పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన జారీ చేసే అవకాశముంది.


