News February 27, 2025
నిర్మల్: 109 మంది ఓటేశారు..!

నిర్మల్ జిల్లా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ బుధవారం ముగిసింది. ఎన్నికల విధుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం జిల్లాలో మొత్తం 149 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పోలింగ్ అధికారులు తెలిపారు.
Similar News
News February 25, 2026
టారిఫ్‌లపై ట్రంప్ కీలక ప్రకటన

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే దేశాలపై టారిఫ్‌లు విధించానని, వీటికి చట్టబద్ధత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనివల్ల US ప్రజలకు పన్నుల భారం తగ్గుతుందన్నారు. టారిఫ్‌ల విషయంలో కోర్టు తీర్పుపై ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని తెలిపారు. దురదృష్టవశాత్తూ దేశంలో సుప్రీంకోర్టు నుంచి పాలన సాగుతోందని మండిపడ్డారు. ఏది ఏమైనా అమెరికాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
News February 25, 2026
అల్లూరి: డోలీ మోత.. దారిలోనే ప్రసవం

అనంతగిరిలో మరో డోలీ మోత ఘటన గిరిజనులు పడుతున్న దుర్భర పరిస్థితిని అద్దం పడుతోంది. మల్లిపాడుకు చెందిన గొల్లూరి సుమిత్రకు పురిటి నొప్పులు రాగా (25) బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు మార్గమధ్యంలో ప్రసవమైంది. రోడ్డు సౌకర్యం లేక 6 కిలోమీటర్లు డోలీ మోతతో గ్రామస్థులు తీసుకొని వెళ్తుండగా ప్రసవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News February 25, 2026
PDPL: సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడికి తీవ్ర గాయాలు

రామగుండం సింగరేణి 11వ బొగ్గు గనిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఐలయ్య అనే కోల్ కట్టర్ తీవ్రంగా గాయపడ్డారు. గనిలో బ్లాస్టింగ్ అనంతరం అకస్మాత్తుగా సైడ్ ఫాల్ (బొగ్గు పెల్లలు) పడడంతో ఆయన నడుము, కుడి కాలుకు గాయాలయ్యాయి. బాధితుడిని జీడీకే సింగరేణి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రుడికి నాణ్యమైన వైద్యం అందించాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు.


