News February 27, 2025

నిర్మల్: 12 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

image

ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 20 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 35 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.

Similar News

News December 8, 2025

భద్రాచలం: పట్టుబడిన సుమారు రూ.కోటి నిషేధిత గంజాయి

image

కూనవరం రోడ్లో ఎస్ఐ సతీష్ నిర్వహించిన వాహన తనిఖీల్లో 222.966 కేజీల గంజాయి లభ్యమైనట్టు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కూనవరం నుంచి భద్రాచలం వైపుగా వెళ్తున్న లారీని ఆపి తనిఖీలు చేయగా ప్రభుత్వ నిషేధిత 110 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.1,11,48,300 ఉంటుందని చెప్పారు. బుచ్చయ్య, రమేష్, షేక్ షఫివుద్దిన్, మహమ్మద్ మోసిన్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

News December 8, 2025

అనకాపల్లి: చిన్నారుల ఆధార్ నమోదును వేగవంతం చేయాలి

image

జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారుల ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ఆధార్ కార్డుల నమోదు, నవీకరణపై జిల్లాస్థాయి ఆధార్ కమిటీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలలో ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ నమోదు చేయాలన్నారు. తల్లి బిడ్డకు జన్మ ఇచ్చిన వెంటనే వైద్యశాలలోనే ఆధార్ నమోదు చేయాలన్నారు.

News December 8, 2025

ఇండిగో అంశం కేంద్రం పరిధిలోనిది: చంద్రబాబు

image

AP: ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కేంద్రమంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ అని చంద్రబాబు తెలిపారు. కాగా ఇండిగో సంక్షోభాన్ని మంత్రి లోకేశ్ మానిటర్ చేస్తున్నారని ఇటీవల ఓ టీవీ డిబేట్‌లో టీడీపీ MLC దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి.