News February 27, 2025

నిర్మల్: 12 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

image

ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 20 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 35 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.

Similar News

News March 27, 2025

ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్లకు రూ.లక్ష రుణం: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముందు డబ్బులు పెట్టుకోలేని నిరుపేదలకు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వివిధ మండలాల్లోని పైలట్ గ్రామాల్లో మంజూరు చేసిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. పైలట్ గ్రామాల్లో ఎంపిక చేసిన 850 లబ్ధిదారుల్లో ఇంటి నిర్మాణానికి ముందు రుణాలను ఇవ్వాలని అన్నారు.

News March 27, 2025

ఆ భూమి వేలాన్ని నిలిపివేయండి: కిషన్ రెడ్డి

image

TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రాంతంలో అనేక వృక్ష, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ వ్యతిరేకించారని గుర్తు చేశారు.

News March 27, 2025

రంగారెడ్డి జిల్లా వెదర్ UPDATE

image

రంగారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. బుధవారం తాళ్లపల్లిలో 39.5℃, మాడ్గుల్ 39.4, రాజేంద్రనగర్, కాసులాబాద్ 39.3, ఎలిమినేడు, కందువాడ, తట్టిఅన్నారం 39.2, చుక్కాపూర్, చందనవల్లి, కొందుర్గ్, మంగళపల్లె, కడ్తాల్, యాచారం 39.1, మామిడిపల్లి 39, మీర్‌ఖాన్‌పేట, దండుమైలారం, రెడ్డిపల్లె 38.9, ఆమన్‌గల్, మొగలిగిద్ద, కేశంపేట, షాబాద్ 38.8, గున్గల్, HCU 38.7, ఇబ్రహీంపట్నంలో 38.6℃ ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!