News March 6, 2025

నిర్మల్: 2nd ఇయర్ పరీక్షకు 296 గైర్హాజరు

image

గురువారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మిడియట్ విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురాం తెలిపారు. 6,102 మంది విద్యార్థులకు గాను 5,806 మంది విద్యార్థులు హజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 5,172, ఒకేషనల్ విభాగంలో 634 మంది విద్యార్థులు పరీక్షకు హజరుకాగా, 296 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.

Similar News

News February 7, 2026

శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్ టెస్ట్.!

image

5th నుంచి 9th వరకు చదువుతున్న విద్యార్థులకు శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఈ పరీక్ష ఆదివారం ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి ఆల్ బ్యాంక్ కాలనీలోని శ్రీ షిర్డీసాయి విద్యానికేతన్ స్కూల్‌లో జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరు సద్వినియోగం చేసుకోవాలని విద్యాసంస్థల ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ సూచించారు.

News February 7, 2026

భారత వృద్ధి రేటును పెంచిన గోల్డ్‌మన్ శాక్స్

image

2026 సంవత్సరానికి సంబంధించి భారత రియల్ GDP వృద్ధి రేటు అంచనాను గోల్డ్‌మన్ శాక్స్ 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.9%కి సవరించింది. భారత వస్తువులపై టారిఫ్‌లను 25% నుంచి 18%కి తగ్గిస్తూ US నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. దీనివల్ల ఎగుమతులు పెరగడమే కాకుండా, ప్రైవేట్ పెట్టుబడులూ పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. దీంతో రూపాయిపై ఒత్తిడి తగ్గి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని వెల్లడించింది.

News February 7, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం

image

కోవూరులో ఇటీవల అపహరణకు గురైన బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అంగడికి వెళ్తున్న బాలికను ఇద్దరు మైనర్లు బైకుపై ఎక్కించుకుని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ద్రవం తాగించడంతో బాలిక కోమాలోకి వెళ్లిపోంది. అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాలికను తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయింది. మైనర్లను జువెలైన్ హోంకు తరలించారు.