News February 18, 2025

నిర్మల్: 3 ప్రమాదాలు.. ఐదుగురు మృతి

image

నిర్మల్ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కాగా ఓ అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. ఇందులో మూడు ఘటనలు బాసరలో జరగడం గమనార్హం. ఆర్జీయూకేటీ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు చనిపోగా.. అదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైంది. పుష్కరఘాట్ల వద్ద మరొకరు నీటమునిగి చనిపోయారు. సారంగాపూర్ మండలంలో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు దుర్మరణం చెందారు.

Similar News

News November 19, 2025

17వ వార్షికోత్సవంలోకి ట్రూ జోన్ సోలార్

image

తెలంగాణకు చెందిన పాన్-ఇండియా సోలార్ కంపెనీ అయిన ట్రూజోన్ సోలార్ (సుంటెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్) బుధవారంతో 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో 17వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. కొన్ని సంవత్సరాలుగా ట్రూజోన్ దేశంలోని అత్యంత విశ్వసనీయ సోలార్ బ్రాండ్‌లలో ఒకటిగా అవతరించింది. కస్టమర్-ఫస్ట్ విధానంతో ట్రూజోన్ సోలార్ భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నడిపించడానికి కట్టుబడి ఉంది.

News November 19, 2025

జగిత్యాలలో కోటి చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి.!

image

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమం అమలుకు జగిత్యాల అధికారులు సిద్ధమయ్యారు. కోటి మహిళలకు చీరల పంపిణీ లక్ష్యంగా, నవంబర్ 19–డిసెంబర్ 9 మధ్య 65 లక్షల ఐకేపీ మహిళలకు, మార్చిలో మిగిలిన మెప్మా మహిళలకు చీరలు ఇవ్వాలని సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. కలెక్టర్ బి. సత్యప్రసాద్, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

News November 19, 2025

వైఎస్ జగన్‌ని కలిసిన కొడాలి, పేర్ని, వల్లభనేని

image

మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, తదితర అంశాలు గురించి జగన్ వారితో చర్చించారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతున్నారా.? అనేది ఈ భేటీకి ప్రాధాన్యత సతరించుకుంది.