News February 18, 2025
నిర్మల్: 3 ప్రమాదాలు.. ఐదుగురు మృతి

నిర్మల్ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కాగా ఓ అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. ఇందులో మూడు ఘటనలు బాసరలో జరగడం గమనార్హం. ఆర్జీయూకేటీ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు చనిపోగా.. అదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైంది. పుష్కరఘాట్ల వద్ద మరొకరు నీటమునిగి చనిపోయారు. సారంగాపూర్ మండలంలో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు దుర్మరణం చెందారు.
Similar News
News March 15, 2025
జైనథ్: 2 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అశోక్

జైనథ్ మండలం అడ గ్రామానికి చెందిన దుర్ల అశోక్ కుమారుడు అవినాశ్ శుక్రవారం విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో ఎంపికయ్యారు. ఆయన ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సైతం ఉద్యోగం సాధించారు. జిల్లాకేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటు ప్రిపేర్ అయినట్లు అవినాశ్ తెలిపారు. ఉద్యోగం సాధించడం పట్ల ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రమేశ్ ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
News March 15, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి ADB జిల్లా జట్టు

ఈనెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు గొప్ప క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించాలని సూచించారు. జిల్లా పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు.
News March 15, 2025
ADB: ‘రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి’

ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర అంశాల గురించి చర్చించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ సూచించారు. ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లతో పాటు ఈ.ఆర్.ఓలు తమతమ స్థాయిలలో పొలిటికల్ పార్టీ మీటింగ్లు ఏర్పాటు చేసి UPDATES అందించాలన్నారు.