News February 18, 2025
నిర్మల్: 3 ప్రమాదాలు.. ఐదుగురు మృతి

నిర్మల్ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కాగా ఓ అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. ఇందులో మూడు ఘటనలు బాసరలో జరగడం గమనార్హం. ఆర్జీయూకేటీ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు చనిపోగా.. అదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైంది. పుష్కరఘాట్ల వద్ద మరొకరు నీటమునిగి చనిపోయారు. సారంగాపూర్ మండలంలో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు దుర్మరణం చెందారు.
Similar News
News March 13, 2026
ఆదిలాబాద్: ఉచితంగా వెజిటబుల్ కిట్ల పంపిణీ

వెజిటబుల్ మినీ కిట్లను గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఉద్యాన శాఖ ద్వారా రైతులకు ఉచితంగా అందిస్తున్న కిట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సహించడానికే ఉచిత కిట్లను అందిస్తున్నామన్నారు.
News March 13, 2026
ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి: ADB కలెక్టర్

హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘జనగణన-2027’లో భాగంగా ‘హౌస్‌లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్’ ప్రక్రియపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో వార్డుల విభజన, స్లమ్ ఏరియాల గుర్తింపు, జియో-ట్యాగింగ్ ప్రక్రియను నిశితంగా చేపట్టాలన్నారు.
News March 12, 2026
ADB: ఉచిత శిక్షణ.. APPLY NOW

టాస్క్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సీ, జావా, పైథాన్, వెబ్ డెవలప్‌మెంట్, సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. గ్రాడ్యుయేట్లు, ఫైనలియర్ విద్యార్థులు అర్హులు. మార్చి 16లోగా ఆధార్, పాన్ కార్డ్, సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 9502786438 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.


