News February 18, 2025
నిర్మల్: 3 ప్రమాదాలు.. ఐదుగురు మృతులు

నిర్మల్ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కాగా ఓ అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. కాగా ఇందులో మూడు ఘటనలు బాసరలో జరగడం గమనార్హం. ఆర్జీయూకేటీ సమీపంలో కారు బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు చనిపోగా.. అదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైంది. పుష్కరఘాట్ల వద్ద మరొకరు నీటమునిగి చనిపోయారు. సారంగాపూర్ మండలంలో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు దుర్మరణం చెందారు.
Similar News
News March 24, 2025
మళ్లీ సొంతగూటికేనా!

కాపు రామచంద్రారెడ్డి తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రాయదుర్గం YCP ఇన్‌ఛార్జిగా ఉన్న గోవిందరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. పార్టీ క్యాడర్ నిరాశలో ఉంది. ఇదే సమయంలో తనకు BJPలో తగిన గుర్తింపు లభించకపోవడంతో రామచంద్రారెడ్డి తిరిగి YCPలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. జగన్ జిల్లాల టూర్‌లో వైసీపీలో కండువా కప్పుకునే అవకాశముంది.
News March 24, 2025
ఈ ఏడాదిలో ఇదే చివరి వారం

అదేంటీ ఇది మార్చి నెలే కదా అనుకుంటున్నారా. మన తెలుగు సంవత్సరం అయిన ‘క్రోధినామ’ సంవత్సరం ఈనెల 29న పూర్తి కానుంది. అంటే ఈ ఏడాదిలో ఇదే చివరి వారం. వచ్చే ఆదివారం 30న ఉగాది సందర్భంగా తెలుగువారంతా ‘విశ్వావసు’ నామ సంవత్సరంలోకి అడుగుపెడతారు. పూర్తిగా ఇంగ్లిష్ క్యాలెండర్‌కు అలవాటుపడ్డ మనం తెలుగు సంవత్సరాలు, పంచాంగం, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమంటారు?
News March 24, 2025
తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

సూర్యాపేట(D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్‌లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు. తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.