News March 7, 2025

నిర్మల్: 415 మంది విద్యార్థులు గైర్హాజరు

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు మాధ్యమిక విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురాం తెలిపారు. 6,838 మంది విద్యార్థులకు గాను 6,423 మంది విద్యార్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 5,869, ఒకేషనల్ విభాగంలో 554 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.

Similar News

News November 22, 2025

మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

image

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.

News November 22, 2025

కృష్ణా: కార్యాలయ పరిసరాలు శుభ్రం చేసిన కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. కలెక్టర్‌తో పాటు డీపీఓ అరుణ, డీఆర్ఓ చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెత్తా చెదారాలను తొలగించారు. వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

News November 22, 2025

వారం రోజులు కన్నాల రైల్వే గేటు మూసివేత

image

పాలకుర్తి మండలం కన్నాల రైల్వే గేటును వారం రోజులు మూసివేస్తున్నట్టు శనివారం రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 23వ తేదీ ఆదివారం నుంచి 29 వరకు కన్నాల లెవెల్ క్రాసింగ్ 46 వద్ద 3వ రైల్వే ట్రాక్ బేస్ తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నందున గేట్ క్లోజ్ చేస్తున్నట్టు అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. కావున ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ దారిని ఎంచుకుని రైల్వే శాఖకు సహకరించాలని కోరారు.