News March 5, 2025
నిర్మల్: 434 మంది విద్యార్థులు గైర్హాజరు

జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 434 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ జాదవ్ పరశురాం తెలిపారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో మొత్తం 6,944 మంది విద్యార్థులకు గాను 6,510 విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News November 5, 2025
కోర్టుకు పాస్‌పోర్ట్ అప్పగించిన రాజంపేట MP

ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటన ముగియడంతో ఆయన ఇండియాకు వచ్చారు. మద్యం కేసులో ఆయనకు కండిషనల్ బెయిల్ వచ్చింది. పాస్‌పోర్ట్‌ను కోర్టులో సమర్పించాలని అప్పట్లోనే ఆదేశించింది. అమెరికా వెళ్లే ముందు ఆయన పాస్‌పోర్టు తీసుకోగా.. ఇవాళ కోర్టులో తిరిగి సమర్పించారు.
News November 5, 2025
ఆరిలోవలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సింహాచలం నుంచి బైక్ పై ఆరిలోవ వైపు వస్తున్న ఇద్దరు యువకులు రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైకు పై ఉన్న ఇద్దరు యువకులు గాయపడడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. మృతుడు గురుద్వార్‌కి చెందిన సూర్యనారాయణగా గుర్తించారు.
News November 5, 2025
నవంబర్ 24 నుంచి పార్లమెంటు సమావేశాలు!

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ఉభయ సభలు ఈనెల 24 లేదా 25 నుంచి సమావేశం అవుతాయని పేర్కొన్నాయి. డిసెంబర్ 19 వరకు ఇవి కొనసాగుతాయని చెప్పాయి. కాగా EC చేపట్టిన దేశవ్యాప్త SIRను వ్యతిరేకిస్తూ ఓట్ చోరీ అంటూ విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు దీనిపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. US టారిఫ్స్‌పైనా ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.


