News February 19, 2025
నిర్మల్: 5 మండలాల ప్రజలకు శుభవార్త

అభయారణ్యంలోని అటవీ చెక్ పోస్టుల ద్వారా 5 మండలాల ప్రజల వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు జన్నారం మండలంలోని ఇందన్పల్లి FRO శ్రీనివాస్ తెలిపారు. జన్నారం, కడెం, దస్తురాబాద్, దండేపల్లి, ఉట్నూర్ మండలాల వాహనాలకు చెక్ పోస్టుల ద్వారా అనుమతి ఉందన్నారు. ఆ వాహనాల యజమానులు సెస్ చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని వాహనదారులు గమనించి ధ్రువీకరణ పత్రాలు చూపించి సహకరించాలన్నారు.
Similar News
News April 17, 2026
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టిపై రాష్ట్రపతికి ఫిర్యాదు..!

ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. “పనులు చేస్తాం.. ప్రజలు తోచింది ఇస్తారు” అన్న వ్యాఖ్యలు లంచం తీసుకోవడాన్ని సమర్థించేలా ఉన్నాయంటూ ఒక వ్యక్తి నేరుగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. బాధ్యత గల ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం నేరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
News April 17, 2026
BREAKING: బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ రైడ్స్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణ ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఇంటిపై శుక్రవారం ఏసీబీ అధికారులకు రైడ్స్ చేపట్టారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు చేస్తున్నారు. అద్దెకు ఉండే ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News April 17, 2026
ఉమెన్ రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకెందుకు: థరూర్

మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా LSలో ప్రస్తుత సభ్యుల సంఖ్యను అనుసరించి అమలు చేయాలని INC MP శశిథరూర్ డిమాండ్ చేశారు. ‘డీలిమిటేషన్ తరువాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారు. LS సభ్యుల సంఖ్యను 850కి పెంచడం ప్రపంచంలో గొప్పదంటున్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలు ఏడాదికి 123 రోజులు జరిగితే ఇప్పుడు 60డేస్‌కు కుదించారు’ అని విమర్శించారు.


