News March 21, 2025
నిర్మల్: ‘9059987730 నంబర్‌కు కాల్ చేయండి’

జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణలో సందేహాలపై అధికారులు హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరికైనా పరీక్షల నిర్వహణపై ఎటువంటి సమాచారం కావాలన్నా, సందేహాలున్నా 9059987730 నంబరును సంప్రదించవచ్చని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. పదో తరగతి పరీక్షలపై ఎటువంటి అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
Similar News
News November 23, 2025
HYD: 25న బల్దియా సర్వసభ్య సమావేశం

మరో రెండున్నర నెలల్లో జీహెచ్ఎంసీ పాలకమండలి ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదానికి మాత్రం ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో చివరి సమావేశం కావడంతో ప్రధాన ప్రతిపక్షమైన BRSకు, కాంగ్రెస్‌కు మధ్య మాటల యుద్ధం తప్పకపోవచ్చని సమాచారం.
News November 23, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.220గా ఉంది. చిత్తూరులో రూ.219-232 వరకు పలుకుతోంది. మటన్ కేజీ రూ.800-900 మధ్య ఉంది. అటు కోడిగుడ్డు రూ.7వరకు అమ్ముతున్నారు. కార్తీక మాసం ముగియడంతో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.
News November 23, 2025
HYD: సైబర్ నేరాలపై ప్రతిజ్ఞ చేయించిన సీపీ

సైబర్ నేరాల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీపీ సజ్జనార్ అన్నారు. శనివారం చార్మినార్ ప్రాంగణంలో ‘జాగృత్ హైదరాబాద్- సురక్షిత్ హైదరాబాద్’ పేరుతో సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోసపూరిత లింక్‌ను ఓపెన్ చేయబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930, సైబర్ పోర్టల్ www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.


