News April 3, 2025
నిర్మల్: KU.. గడువు మరోసారి పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News April 12, 2025
WhatsApp డౌన్..!

వాట్సాప్ సేవల్లో అంతరాయం కలుగుతోందని పలువురు యూజర్లు Xలో పోస్టులు చేస్తున్నారు. మెసేజులు సెండ్ కావట్లేదని, స్టేటస్‌లు అప్డేట్ అవ్వట్లేదని చెబుతున్నారు. అసలు వాట్సాప్ లాగిన్ కావడం లేదని మరికొందరు పేర్కొంటున్నారు. కాగా మన దేశంలో ఎక్కువ మంది వినియోగించే యూపీఐ, వాట్సాప్ సేవలు ఒకేరోజు డౌన్ కావడం గమనార్హం.
News April 12, 2025
రాయలసీమ: రాష్ట్ర స్థాయిలో KGBV విద్యార్థినుల సత్తా

AP ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించిన సీనియర్ ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో కర్నూలు జిల్లా పంచలింగాల KGBVకి చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో మొదటి 3 ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ స్వప్న కుమారి తెలిపారు. మొదటి ర్యాంకులో టీ.మానస 992/1000, 2వ ర్యాంకులో యు. మానస 992/1000, 3వ ర్యాంకులో టీ. సుజాత 981/1000 మార్కులతో నిలిచారు.
News April 12, 2025
కర్నూలు: రాష్ట్ర స్థాయిలో KGBV విద్యార్థినుల సత్తా