News April 4, 2025

నిర్మల్: ‘LRS రాయితీకి ఏప్రిల్ 30 వరకు అవకాశం’

image

ఎల్ఆర్ఎస్ పథకంలో 25% రాయితీ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పెంచిందని మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరి భువన్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రజల నుంచి స్పందన లేకపోవడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగ పర్చుకోవాలని ఆయన కోరారు.

Similar News

News November 28, 2025

నిర్మల్: 2019లో 88 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం..!

image

2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో 88 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 396 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఈ ఏడు 4 GPలు పెరిగాయి. ప్రస్తుతం 400 గ్రామ పంచాయతీలు ఉండగా.. 3,396 వార్డులున్నాయి. అయితే అప్పటి ప్రభుత్వం పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించినా.. నేటికి ఆ సొమ్ము GP ఖాతాల్లో జమ కాలేదు. అటు ఏకగ్రీవం చేస్తే కేంద్రం నుంచి రూ.10లక్షలు ఇస్తామని బండి ప్రకటించారు.

News November 28, 2025

ప్రకాశం జిల్లా వాసులకు గుడ్ న్యూస్..!

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం పామూరు ఈటీఎన్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. నెలకి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం వస్తుందన్నారు. పూర్తి వివరాలకు. 99888 53335 నంబరును సంప్రదించాలన్నారు.

News November 28, 2025

చెక్క దువ్వెన వాడుతున్నారా?

image

జుట్టు ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది చెక్క దువ్వెన వాడుతున్నారు. కానీ దీన్ని క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గోరువెచ్చని నీటిలో డిష్‌వాష్‌ లిక్విడ్‌/ షాంపూ, కొబ్బరి, ఆలివ్‌ నూనెలను కలపాలి. దువ్వెనను ఈ మిశ్రమంలో 2 నిమిషాలు ఉంచి బ్రష్‌తో రుద్దాలి. తర్వాత ఎండలో ఆరబెడితే సరిపోతుంది. నీటితో వద్దు అనుకుంటే నూనెను దువ్వెన మొత్తం పట్టించి ఓ అరగంటయ్యాక బ్రష్‌తో దువ్వెన పళ్లను శుభ్రం చేయాలి.