News April 4, 2025
నిర్మల్: ‘LRS రాయితీకి ఏప్రిల్ 30 వరకు అవకాశం’

ఎల్ఆర్ఎస్ పథకంలో 25% రాయితీ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పెంచిందని మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరి భువన్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రజల నుంచి స్పందన లేకపోవడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగ పర్చుకోవాలని ఆయన కోరారు.
Similar News
News April 19, 2025
టెక్కలి జిల్లా ఆసుపత్రి సేవలపై పబ్లిక్ కామెంట్స్

➤ <<16135497>>టెక్కలి జిల్లా ఆసుపత్రికి<<>> వచ్చే కేసులను ఎక్కువగా శ్రీకాకుళం రిఫర్ చేయడం➤ఇక్కడ పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేట్ క్లినిక్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం.➤ఆసుపత్రిలో అందరికీ ఫ్యాన్లు,తాగునీరు లేకపోవడం,బెడ్ షీట్లు వేయకపోవడం ➤అత్యవసర ప్రసూతి కేసులపై పర్యవేక్షణ లోపం.➤వేధిస్తున్న అధునాతన వైద్య పరికరాల కొరత ➤ఆసుపత్రిలో రోగులపై కొందరు నర్సులు,సిబ్బంది దురుసు ప్రవర్తన.➤కొన్ని ముఖ్యమైన మందులు కొరత.
News April 19, 2025
భీమవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన అడ్డాల చిన్న (24) భీమవరం రూరల్ మండలంలో లోసరి హైవేపై వ్యాన్ ఢీకొనడంతో తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు చిన్న హైదరాబాదులో జిమ్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడని, బైక్‌పై హైదరాబాద్ నుంచి ప్రత్తిపాడు వెళుతుండగా లోసరిలో ఈ ప్రమాదం సంభవించింది అని తెలిపారు.
News April 19, 2025
వికారాబాద్: అగ్నివీర్ దరఖాస్తులు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యువకుల నుంచి అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21 నుంచి మే 11 వరకు అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాలీ ఉంటుందన్నారు. http://agnipathvayu.cdac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు సికింద్రబాద్‌లోని కమాండింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని (040-27758212) సంప్రదించవచ్చు.SHARE IT