News April 11, 2025

నిర్మల్‌: MAY 1 నుంచి క్రీడా శిబరాలు.. APPLY NOW

image

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మే 1 నుంచి 31 తేదీ వరకు ఈ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి గల క్రీడా సంఘాలు, పీడీలు, పీఈటీల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు ఈనెల 15వ తేదీలోగా తమ దరఖాస్తులను కలెక్టరేట్లో సమర్పించాలని తెలిపారు.

Similar News

News November 14, 2025

BREAKING: శంషాబాద్ విమానాశ్రయంలో FULL EMERGENCY ప్రకటన

image

లండన్ నుంచి HYD వచ్చే BA 277 (STA 05:20) విమానానికి బాంబ్ బెదిరింపు కారణంగా ఈరోజు ఉదయం 4:46 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 5:10 గంటలకు 167 మంది ప్రయాణికులు, ఇద్దరు శిశువులు, ఇద్దరు కాక్‌పిట్ సిబ్బంది, 8 కేబిన్ సిబ్బందితో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని ప్రస్తుతం ఐసోలేషన్ బేకు తరలించి తనిఖీ చేస్తున్నారు.

News November 14, 2025

రాజుపేట అబ్బాయికి దక్షిణ కొరియా అమ్మాయితో పెళ్లి

image

వీఆర్ పురం మండలం రాజుపేట కాలనీకి చెందిన నాగేంద్ర ప్రసాద్ దక్షిణ కొరియాకు చెందిన MIN.KYONGతో వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు గురువారం మీడియాకు తెలిపారు. అక్కడే సాఫ్ట్ వెర్ జాబ్ చేస్తున్న నాగేంద్ర ప్రసాద్‌కు పరిచయమైన ఆమెను సీయోల్‌లో బౌద్ధ మత ఆచార పద్ధతి లో వివాహం చేసుకున్నాడని తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరిగిందన్నారు. పలువురు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

News November 14, 2025

MBNR: నెట్‌బాల్ ఎంపికలకు 200 మంది

image

MBNR స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉమ్మడి జిల్లాకు చెందిన అండర్-14, 17, 19 బాల బాలికలకు నెట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ట్రయల్స్‌కు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 15 నుంచి 17 వరకు మహబూబాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి నెట్‌బాల్ టోర్నీలో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి డా.ఆర్.శారదాబాయి తెలిపారు.