News March 6, 2025
నిర్మల్: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.
Similar News
News December 9, 2025
జీవీఎంసీలో అవినీతిపై కమిషనర్ ఉక్కుపాదం

జీవీఎంసీలో అవినీతిని ఉపేక్షించేది లేదని కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ఒక డీఈఈ (DEE), టీపీవో (TPO)ను సరెండర్ చేశామని, ఏఈ (AE)పై విచారణకు ఆదేశించామని తెలిపారు. అవినీతికి పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగులంతా పారదర్శకంగా పనిచేసి నగర అభివృద్ధికి సహకరించాలని ఆదేశించారు.
News December 9, 2025
OFFICIAL: ‘అఖండ-2’ రిలీజ్ డేట్ ఇదే

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ-2’ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. 11న ప్రీమియర్లు ఉంటాయని, త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలిపింది. ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఫైనాన్షియల్ వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదాలు <<18513521>>పరిష్కారమవడంతో<<>> మూవీ రిలీజ్కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
News December 9, 2025
ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ, ఎస్టీ సంఘం నూతన కమిటీ ఎన్నిక

ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం డిస్కం నూతన కమిటీని విశాఖలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సిహెచ్.సాయిబాబు, అధ్యక్షుడిగా ఎం.నిరంజన్ బాబు, జనరల్ సెక్రటరీగా ఎన్.వెంకటరావు ఎన్నికయ్యారు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఏర్పాటైన ఈ కమిటీ మూడేళ్లు కొనసాగుతుందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సాయిబాబు తెలిపారు.


