News March 6, 2025
నిర్మల్: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.
Similar News
News January 25, 2026
NGKL: మున్సిపల్ పోరుకు సిద్ధం.. ఇన్చార్జిల నియామకం!

నాగర్ కర్నూల్ జిల్లాలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జిలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు, కల్వకుర్తికి మాజీ కార్పొరేషన్ రాజీవ్ సాగర్, కొల్లాపూర్‌కు ఉప్పల వెంకటేష్ గుప్తా, అమన్‌గల్‌కు రజిని సాయిచందు ను నియమించారు.
News January 25, 2026
తిరుమల గిరుల్లో రథసప్తమి శోభ

AP: తిరుమలలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5:30 గంటలకే మలయప్ప స్వామి ఉభయ దేవతలతో కలిసి సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. శ్రీవారి నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
News January 25, 2026
సిరిసిల్ల: కన్న పేగు కంటతడి.. తల్లడిల్లిన గోమాత

కన్న పేగు మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఘటన వీర్నపల్లి మండలం ఎర్రగడ్డతండాలో జరిగింది. బానోత్ రాజు పశువులు సమీప అటవీకి మేతకు వెళ్లాయి. అక్కడే ఉన్న చిరుత లేగదూడపై దాడి చేసి హతమార్చింది. ఇంటికి చేరుకున్న ఆవు యజమానిని తచ్చాడి మృతిచెందిన బిడ్డ కళేబరం వద్దకు తీసుకెళ్ళింది. లేగదూడ కళేబరాన్ని ముద్దాడుతూ గోమాత తల్లడిల్లిన తీరు కలచివేసింది.


