News March 9, 2025
నిర్మల్: MLC రేసులో రేఖానాయక్?

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖానాయక్ MLA కోటా MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో ఉన్న ఆమె ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఆమెకు అవకాశం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై అదిష్ఠానంతో చర్చించనున్నారు. ఎస్టీ కేటగిరీ నుంచి రేఖానాయక్‌కు అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..!
Similar News
News March 27, 2025
2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: నిమ్మల

AP: CM చంద్రబాబు కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్న నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2026 నాటికి నిర్వాసితులకు అన్ని కాలనీలను నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
News March 27, 2025
పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అంతర్గాం 39.8℃ నమోదు కాగా ముత్తారం 39.7, రామగిరి 39.6, ఓదెల 39.6, కాల్వ శ్రీరాంపూర్ 39.5, సుల్తానాబాద్ 39.3, పాలకుర్తి 38.9, మంథని 38.6, ధర్మారం 38.5, కమాన్పూర్ 38.4, రామగుండం 38.3, పెద్దపల్లి 38.1, ఎలిగేడు 37.7, జూలపల్లి 36.9℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది.
News March 27, 2025
బైక్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. నేరుగా A/Cకి డబ్బులు!

ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి బైక్ రైడింగ్, క్యాబ్ బుకింగ్ కంపెనీల ఆధిపత్యానికి ఇక గండి పడనుంది. వీరికి అధిక కమిషన్లు చెల్లిస్తూ నష్టపోతున్న డ్రైవర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. మధ్యవర్తులు లేకుండా వారు నేరుగా లబ్ధి పొందేలా త్వరలో ‘సహకార ట్యాక్సీ’ యాప్‌ను తీసుకొస్తామని లోక్‌సభలో సహకార మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఇందులో బైకులు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు, ఫోర్‌వీలర్స్‌ను సహకార సంస్థలే నమోదు చేస్తాయి.