News March 28, 2025
నిర్మల్: SCHOLARSHIP.. APPLY NOW

2024-25 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్, డిగ్రీ, వృత్తి విద్య, ఇతర కోర్సుల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులు అర్హులని చెప్పారు. కొత్తగా ఉపకార వేతనాల కోసం మే 5వ తేదీ వరకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 20, 2025
వరంగల్: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనిఖీల కోసం చెక్పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుమతి లేని ఇసుక రవాణాపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. విజిలెన్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 20, 2025
రేపు సాయంత్రానికి కోర్టుకు చిన్నఅప్పన్న

తిరుమల కల్తీ నెయ్యి కేసులో CBI సిట్ అధికారులు విచారణ చేస్తున్న ఏ-24 నిందితుడు చిన్ని అప్పన్న కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. అనంతరం సాయంత్రం 5 గంటలలోపు ఆయనకు రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నెల్లూరు కోర్టుకు తీసుకెళ్లనున్నారు. గురువారం(ఇవాళ) విచారణలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
News November 20, 2025
వరంగల్ కలెక్టర్ను అభినందించిన ఎమ్మెల్యే రేవూరి

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరీ-2లో తొలి స్థానం సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అభినందించారు. డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు, రూ. కోటి బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చిన కలెక్టర్ ను ప్రశంసించారు.


