News March 28, 2025
నిర్మల్: SCHOLARSHIP.. APPLY NOW

2024-25 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్, డిగ్రీ, వృత్తి విద్య, ఇతర కోర్సుల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులు అర్హులని చెప్పారు. కొత్తగా ఉపకార వేతనాల కోసం మే 5వ తేదీ వరకు సంబంధిత వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News July 11, 2025
NLG: పంతుళ్ల పరేషాన్.. బడికి డుమ్మా ఇక కుదరిదిక!

సర్కారు బడులను గాడిలో పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్త్రాన్ని సంధిస్తోంది. ఇప్పటివరకు విద్యార్థులకు FRS విధానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం టీచర్లకు ఆ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతుంది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న పెద్దపల్లి జిల్లాలో FRS విధానం సత్ఫలితాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉమ్మడి జిల్లాలో సైతం టీచర్ల ముఖ గుర్తింపు అటెండెన్స్ సిస్టం ప్రారంభం కాబోతుంది.
News July 11, 2025
కృష్ణా: పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో ఫిబ్రవరి 2025లో నిర్వహించిన ఎం.టెక్ 1వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జులై 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.1,100 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.