News September 2, 2024

నిర్మల ఎగువ మానేరు జలాశయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

image

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం
నర్మాల గ్రామంలోని ఎగువ మానేరు జలాశయం పూర్తిగా నిండి మత్తడి దుంకుతోంది. దీంతో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది.

Similar News

News September 16, 2024

HZB: వినాయక నిమజ్జనం.. పోలీసుల సూచనలు

image

సోమవారం జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా హుజూరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. ☞విగ్రహాలు కరెంటు వైర్లకు తగలకుండా చూసుకోవాలి. ☞నీటిలో క్రేన్ల ద్వారా మాత్రమే విగ్రహాలను వేయాలి. ☞ఈత రాని వారు నీటి వద్దకు వెళ్లకూడదు. ☞హైటెన్షన్ వైర్ల వద్ద విగ్రహాలను జాగ్రత్తగా తీసుకెళ్లాలి. ☞వాహనాలలో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.

News September 15, 2024

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాస మూలమలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్తున్న ట్రావెల్ బస్సు, వెల్గొండ నుంచి జగిత్యాల వైపు వస్తోన్న స్కూటీ, బైకును ఢీకొంది. దీంతో అల్లీపూర్‌కు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు తప్పని నిరీక్షణ!

image

కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా మోక్షం కలగడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం నిలిచిపోయిన రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నేటికీ పునరుద్ధరించుకోలేదు. ఆహార భద్రతతో పాటు సంక్షేమ పథకాలకు ఈ కార్డే కీలకం కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తోందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.