News February 12, 2025

నిర్లక్ష్యం వహిస్తే సహించబోను: ప్రకాశం కలెక్టర్

image

బాలలకు ఆధార్ కార్డుల జారీ కోసం ప్రత్యేక శిబిరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ అన్సారియా స్పష్టం చేశారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో బుధవారం ఒంగోలులోని కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శిబిరాల తీరు, పురోగతిపై సమక్షించారు. పనితీరు పేలవంగా ఉన్న సిబ్బందికి షోకజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులకు తెలిపారు.

Similar News

News March 18, 2025

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ప్రకాశం కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కలెక్టర్ అన్సారియా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అర్జిదారులను కూర్చోబెట్టి మాట్లాడడం దగ్గర నుంచి సమస్య పరిష్కారం అయ్యేలా ప్రత్యేక సిబ్బందిని కలెక్టర్ నియమించారు.

News March 17, 2025

మార్కాపురం: ఆస్తి తీసుకొని గెంటేశాడయ్యా!

image

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపల మడుగు కొత్తపల్లికి చెందిన వృద్ధుడు కోటయ్య కన్న కొడుకు గెంటేశాడని మార్కాపురం సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించాడు. తన కొడుకు ఆస్తి మొత్తాన్ని తీసుకొని, అన్నం పెట్టకుండా గెంటేశాడని సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్‌కు ఫిర్యాదు చేశాడు. గతంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని కోటయ్య వాపోయాడు. దీంతో చేసేదేమీ లేక న్యాయం చెయ్యాలని సబ్ కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చాడు.

News March 17, 2025

ఒంగోలు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతి

image

రాజ్యసభ సభ్యుడు, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలిగింది. తల్లి ఎర్రం పిచ్చమ్మ (85) అనారోగ్యంతో ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఆమె మృతిపై పలువురు సంతాపం తెలిపారు. కొన్ని రోజులుగా ఎర్రం పిచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. పిచ్చమ్మ అంత్యక్రియలు ఈరోజా రేపా అనేది కుటుంబం సభ్యుల నుంచి సమాచారం రావాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!