News September 11, 2024

నిలకడగా భద్రాచలం గోదావరి నది ప్రవాహం

image

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గడిచిన గంట నుంచి నిలకడగా కొనసాగుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 5 గంటలకు 50.5 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటిమట్టం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం లేదని, ఒకవేళ పెరిగినా స్వల్పంగా పెరిగి, అనంతరం తగ్గుముఖం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 25, 2025

ఖమ్మం బీఆర్‌ఎస్‌లో గ్రూపు తగాదాలు..!

image

ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయన్న చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో గ్రూపు తగాదాలను ఆపకుంటే పార్టీకి భారీ నష్టం తప్పదని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News November 25, 2025

19 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి

image

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న 19మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించింది. సీపీ సునీల్ దత్ మంగళవారం వారికి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. వీరిలో నలుగురిని మహబూబాబాద్‌కు, 14 మందిని భద్రాద్రి కొత్తగూడెంకు, ఒకరిని ఇతర విభాగానికి కేటాయించారు.

News November 25, 2025

ఖమ్మం కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల హవా!

image

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికార కాంగ్రెస్ కార్పొరేటర్ల కంటే బీఆర్‌ఎస్ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మున్సిపల్ కాంట్రాక్టులు, ఎల్‌ఆర్‌ఎస్ పనులలో అధికారులు వారికే సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నిర్మాణాలపై, రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది.