News March 5, 2025
నిలువెల్లా రక్తం.. తల్లడిల్లిన తల్లి హృదయం..!

రోడ్డు ప్రమాదంలో ఆ తల్లికి తీవ్రగాయాలై నిలువెల్లా రక్తం కారుతోంది. అయినా సరే ఆ తల్లి హృదయం తన బిడ్డ కోసం తల్లడిల్లింది. తన బిడ్డకు ఏమైందోనని ఆమె పడిన తాపత్రయం స్థానికులను కంటతడి పెట్టించింది. KMM జిల్లా <<15656275>>తనికెళ్ల వద్ద బస్సు బోల్తా పడిన<<>> ఘటనలో ఈ దృశ్యం కనిపించింది. బస్సులో ఉన్న తల్లాడ మండలం అన్నారుగూడెం వాసి బీరవెల్లి రాణికి రక్తం కారుతున్నా బిడ్డ కోసం వెతికింది. ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
Similar News
News November 28, 2025
మంచిర్యాల జిల్లాలో సర్పంచి స్థానాలకు 99 నామినేషన్లు

మంచిర్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతోంది. శుక్రవారం 90 సర్పంచ్ స్థానాలకు 99 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 816 వార్డులకు 222 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ, 11న పోలింగ్ జరగనుంది.
News November 28, 2025
MDK: రెండో రోజు 152 సర్పంచ్, 186 వార్డు నామినేషన్లు

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల స్వీకరణలో సర్పంచ్ స్థానాలకు 152, వార్డు సభ్యుల స్థానాలకు 186 నామినేషన్లు వచ్చాయి. అల్లదుర్గ్ 14, హవేలీఘనపూర్ 49, పాపన్నపేట్ 25, రేగోడు 18, శంకరంపేట్(ఏ) 17, టేక్మాల్ 29 సర్పంచ్ నామినేషన్లు స్వీకరించారు. వివరాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు.
News November 28, 2025
వనపర్తిలో 780 వార్డులకు 276 నామినేషన్లు

వనపర్తి జిల్లాలో మొదటి విడత జరగనున్న 87 గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని మొత్తం 780 వార్డులకు రెండు రోజుల్లో 276 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 250 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
మండలాల వారీగా వివరాలు:
ఘనపూర్: 90
పెద్దమందడి: 83
రేవల్లి: 51
గోపాల్పేట: 19
ఏదుల: 07


