News May 2, 2024
నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి: బాపట్ల ఎస్పీ
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి జిల్లాకు విచ్చేసిన సాయుధ బలగాల అధికారులతో, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ శాఖతో సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల విధులలో నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలని తెలిపారు.
Similar News
News November 4, 2024
ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే..!
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11:30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం సీఆర్డీఏపై సమీక్ష చేసి స్పోర్ట్స్ పాలసీపై రివ్యూ చేస్తారు. సాయంత్రం వ్యవసాయ పశుసంవర్ధక శాఖపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
News November 4, 2024
గుంటూరులో నడిరోడ్డుపై కత్తితో వీరంగం
గుంటూరులో రుణం తిరిగి చెల్లించే విషయంలో కొందరు వ్యక్తులు కత్తులు, రాళ్లతో బీభత్సం సృష్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి తాను ఇచ్చిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదని సుబ్రహ్మణ్యేశ్వర రావును నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి తమ అనుచరులను పిలుచుకొని ఒకరినొకరు కార్లతో గుద్దుకొని భయభ్రాంతులకు గురిచేశారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News November 4, 2024
వైసీపీ నేతలు కళ్లకు గంతలు విప్పుకోవాలి: ప్రత్తిపాటి
వైసీపీ నేతలు వారి కళ్లకు కట్టుకున్న నీలి గంతలు విప్పుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు కనిపిస్తాయని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండలం జంగాలపల్లి, తూబాడులో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తూబాడులోని రూ.15 లక్షలతో సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణానికి, జంగాలపల్లిలో సీసీ రహదారులకు భూమిపూజ చేశారు.