News March 19, 2025
నీటిఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు: కలెక్టర్

తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాను బలోపేతం చేయాలని, లీకేజీలను వెంటనే సరిచేయాలన్నారు. బోర్లు, పంపుల మరమ్మతులు చేయాలని, నీటి వనరులను గుర్తించాలని ఆదేశించారు. ప్రజలకు నీటివినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బోర్లు, చేతి పంపులను మరమ్మతులు చేయాలన్నారు.
Similar News
News April 18, 2025
ఆదిలాబాద్ జిల్లాలో మరో పైలట్ ప్రాజెక్ట్

ఇందిరా గిరి సోలార్ జల వికాసం పథకానికి రూ.12,500 కోట్ల ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం విధి విధానాలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలన్నారు. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చి.. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది.
News April 18, 2025
ADB: కాంగ్రెస్ కార్యకర్తలపై పోస్ట్.. ఒకరిపై కేసు: CI

కాంగ్రెస్ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పట్టణానికి చెందిన శైలేష్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సప్‌లో మెసేజ్ పోస్ట్ చేసినట్లు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రూపేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
News April 18, 2025
ADB: విద్యార్థులు SPORTS ట్రైనింగ్‌కి సిద్ధం కండి

సమ్మర్ క్యాంప్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ ఛాంబర్‌లో వేసవి శిక్షణ శిబిరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31 వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. 6 నుంచి 14 ఏళ్ల బాలబాలికలు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.