News March 14, 2025

నీటి ఎద్దడిలో రైతులకు సూచనలు.. Way2news స్పెషల్

image

వేసవి సమీపిస్తున్న వేళ రైతులు పంటలకు తడులు వేసే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. ఆయన నర్సాపూర్లో Way2newsతో మాట్లాడుతూ.. జిల్లాలో 2,58,487 ఎకరాలో వరి, 8321 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో నీటి ఎద్దడి నేపథ్యంలో రైతుల నీటిని పొదుపుగా వాడుకొని పంటలు సాగుచేసుకోవాలని సూచించారు.

Similar News

News November 28, 2025

ఫూలే వర్ధంతి: మంత్రి పొన్నం నివాళి

image

మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ కోసం ఫూలే చేసిన సేవలను స్మరించుకుంటూ నాయకులు, అధికారులు పుష్పాంజలి ఘటించారు. ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.

News November 28, 2025

మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.