News March 7, 2025
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

ఓబులదేవరచెరువు మండలం వేమారెడ్డిపల్లికి చెందిన గంగరాజు కుమారుడు ద్వారకనాథ్ (4) గురువారం నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. తాత, నానమ్మ పనిలో ఉండగా బాలుడు ఇంటి వెనకాల ఆడుకుంటూ పశువుల కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. వెంటనే గుర్తించిన స్థానికులు బాలుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం కదిరి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.
Similar News
News October 14, 2025
జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా సుజాత బాధ్యతలు

నెల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ అధికారినిగా సుజాత బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ సంబంధిత శాఖ అధికారినిగా విధులు నిర్వహిస్తున్న పరిమళ బదిలీ కావడంతో కొద్ది కాలంగా ఈ పోస్ట్ భర్తీ కాలేదు. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరంలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిగా పని చేస్తున్న సుజాతకు ప్రమోషన్ లభించడంతో అధికారులు ఆమెను నెల్లూరుకు బదిలీ చేశారు.
News October 14, 2025
MCTEలో 18 పోస్టులు

క్యాడెట్స్ ట్రైనింగ్ వింగ్ ఆఫ్ మిలటరీ కాలేజీ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (MCTE)18 అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎంఎస్, MSc, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 31 వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
News October 14, 2025
‘ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోండి’

భద్రాద్రి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉపకార వేతనాల కోసం అప్లై చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి కోరారు. https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకుని కాపీలను ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీస్ S27లో సబ్మిట్ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి లక్షన్నర, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల లోపు ఆదాయం ఉండాలన్నారు.