News March 7, 2025

నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

image

ఓబులదేవరచెరువు మండలం వేమారెడ్డిపల్లికి చెందిన గంగరాజు కుమారుడు ద్వారకనాథ్ (4) గురువారం నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. తాత, నానమ్మ పనిలో ఉండగా బాలుడు ఇంటి వెనకాల ఆడుకుంటూ పశువుల కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. వెంటనే గుర్తించిన స్థానికులు బాలుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం కదిరి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.

Similar News

News March 16, 2025

భారత త్రో బాల్ జట్టుకు ఎంపికైన వెన్నపూస రోషీ రెడ్డి

image

భారత త్రో బాల్ జట్టుకు అనంతపురానికి చెందిన వెన్నుపూస రోషీ రెడ్డి ఎంపికయ్యారు. భారత పారా త్రో బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆల్బర్ట్ ప్రేమ్ కుమార్ ఎంపికైన లేఖను పంపించినట్లు రోషీ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షులు డాక్టర్ శంకర్ నారాయణ అతడిని అభినందించారు. కంబోడియాలో జరిగే ఆసియా పారా త్రోబాల్ టోర్నమెంట్లో భారత జట్టు తరపున ఆడనున్నారు.

News March 16, 2025

అనంతపురం: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ఈ నెల 17వ తేదీన సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని సూచించారు.

News March 16, 2025

అనంతపురం: ‘పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు’ 

image

పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి సెల్‌ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చెయ్యనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలతో పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామన్నారు.

error: Content is protected !!