News March 7, 2025
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

ఓబులదేవరచెరువు మండలం వేమారెడ్డిపల్లికి చెందిన గంగరాజు కుమారుడు ద్వారకనాథ్ (4) గురువారం నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. తాత, నానమ్మ పనిలో ఉండగా బాలుడు ఇంటి వెనకాల ఆడుకుంటూ పశువుల కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. వెంటనే గుర్తించిన స్థానికులు బాలుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం కదిరి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.
Similar News
News March 17, 2025
రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సోమవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్‌కు విద్యారంగ, టీచర్ల సమస్యలు విన్నవించారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
News March 17, 2025
CM చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

AP: క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా MLC నాగబాబుకు మంత్రి పదవిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని పున:ప్రారంభ పనులకు ప్రధాని మోదీని ఆహ్వానించే అంశంతో పాటు పలు కీలక అంశాలపై కూడా వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News March 17, 2025
సిరిసిల్ల: 2 వేల కోట్లు కేటాయించాలి: రమేష్

బడ్జెట్ సమావేశాలలో చేనేత పవర్ లూమ్ రంగాలకు రూ.2 వేల కోట్లు కేటాయించాలని సిఐటియూ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూసం రమేష్ అన్నారు. హైదరాబాద్‌లో మంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లకు సోమవారం వినతిపత్రం అందించారు. పవర్లూమ్ రంగాలపై ఆధారపడి పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులకు ఉపాధి కల్పించాలంటే బడ్జెట్లో రూ.2వేల కోట్ల కేటాయిస్తే సాధ్యమవుతుందని అన్నారు.