News March 31, 2025
నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలను చేపట్టాలి: కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలను ఎప్పటికప్పుడు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల పరిధిలో చేపడుతున్న నీటి నాణ్యత పరీక్షలు పక్కాగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. రెండు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
Similar News
News April 22, 2025
డ్రైవర్ డోర్ డెలివరీ కేసు పునర్విచారణ

AP: కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో పునర్విచారణకు కాకినాడ SP బిందు మాధవ్ ఆదేశించారు. విచారణ అధికారిగా IPS అధికారిని నియమించారు. 60 రోజుల్లో విచారణ నివేదిక అందజేయాలన్నారు. 2022 మే 19న YCP MLC అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం సంచలనమైంది. అప్పటి ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చిందనే ఆరోపణలు వచ్చాయి.
News April 22, 2025
సిరిసిల్ల : నేడు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

జిల్లాలో మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనుంది. జిల్లాలో మొత్తం 9,310 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 5,065 మంది ఫస్టియర్, 4.245 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం నేడు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST
News April 22, 2025
వాస్మోల్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం

భర్త ఇంటికి రావడం లేదని వాస్మోల్ తాగి వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కురబలకోట మండలంలో సోమవారం జరిగిన ఘటనపై పోలీసుల కథనం.. జేసీబీ డ్రైవర్ అనిల్ భార్య లక్ష్మ(23) తన భర్త సకాలంలో ఇంటికి రావడం లేదని గొడవపడి వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు బాధితురాలని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.