News May 26, 2024
నీటి బకెట్లో పడి బాలుడు మృతి

బకెట్లో పడి బాలుడు మృతిచెందిన ఘటన హుజూర్నగర్లో శనివారం జరిగింది. మోడల్ కాలనీలో సతీ సంతోష్సింగ్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కుమారుడు రాజ్కుమార్సింగ్(2) శనివారం ఆడుకుంటూ వెళ్లి బాత్రూంలో ఉన్న నీటి బకెట్లో పడిపోయాడు. కొంతసేపటికి గమనించిన తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News November 7, 2025
Way2News కథనానికి నల్గొండ కలెక్టర్ స్పందన

‘ఇసుక కొరత.. ఇంటి నిర్మాణం జరిగేది ఎట్లా?’అనే శీర్షికతో ఈ నెల 4న Way2Newsలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ అధికారులు జిల్లాలోని ఇసుక రీచ్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.
News November 7, 2025
బాలల హక్కులు, విద్యపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

నల్గొండ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
గురువారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు హరిత, చందనలతో ఆమె సమావేశమయ్యారు. విద్యా సంస్థల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించడంతో విద్యా వ్యవస్థ బలోపేతమైందని కలెక్టర్ వెల్లడించారు. బాల్య వివాహాలు, శిశు విక్రయాల నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు.
News November 6, 2025
నల్గొండ: సోదరిని చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా.. SRPT జిల్లా కేసారానికి చెందిన సువర్ణ రాజు (19), గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని చూడడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. చిట్యాల దాటాక అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనగా బలమైన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై తండ్రి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.


