News November 5, 2024

నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో త్వరలో నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు నిర్వహించనున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలలో ఇరిగేషన్ అధికారులు ప్రతి ఉత్సాహం చూపకూడదని కలెక్టర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా జల వనరుల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి సంఘం ఎన్నికల మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

Similar News

News November 6, 2024

ATP: ముగ్గురు వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసు

image

కనగానపల్లి మండలంలో ముగ్గురు వైసీపీ నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బద్దలాపురంలో దామోదర్ రెడ్డి, దినేశ్ రెడ్డి, శంకర్ రెడ్డి.. లక్ష్మీనరసమ్మ, నరసింహులు అనే దళిత దంపతుల మధ్య పొలం విషయమై గొడవ జరిగింది. తమను కులం పేరుతో తిట్టారని వారు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ఇషాక్ బాషా తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News November 6, 2024

23న సాగునీటి సంఘాల ఎన్నికలు: కలెక్టర్‌ చేతన్‌

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని 230 సాగునీటి సంఘాల ఛైర్మన్‌లు, డైరెక్టర్ల స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు రెవెన్యూ, మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల నిర్వహణలో జలవనరుల శాఖ అధికారులు కూడా నిబంధనల మేరకు వ్యవహరించాలని తెలిపారు.

News November 6, 2024

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ అభిషేక్ కుమార్, శ్రీనివాసులు, పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, ఆర్డీవోలు, నూతన కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.