News February 28, 2025

నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షించాలి: జనగామ కలెక్టర్

image

నీటి సరఫరాపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. గురువారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో నీటి వినియోగంపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. రిజర్వాయర్లలోని నీటిమట్టాన్ని అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, సాగునీరు సరఫరాలో ఇబ్బందులు లేకుండా ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News March 27, 2025

ప్రొద్దుటూరు: 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు

image

ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు నమోదైంది. మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన విద్యార్థి 32 ఫేక్ ఇన్‌స్టాగ్రాం అకౌంట్లతో తన క్లాస్ అమ్మాయిలను వేధించాడు. విషయం తెలిసిన టీచర్ విద్యార్థిని హెచ్చరించారు. తమ బిడ్డనే మందలిస్తారంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో వారితో పాటు మరో వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది.

News March 27, 2025

అనకాపల్లి జిల్లాలో నేడు తీవ్ర వడగాడ్పులు.. వర్షాలు

image

అనకాపల్లి జిల్లాలో గురువారం రెండు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు. ఇదిలావుండగా బుధవారం అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల 39 డిగ్రీల పైన అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్‌ సూచించారు.

News March 27, 2025

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అప్పుడేనా..?

image

మద్యం కేసులో MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగుతోంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుకు సైతం వెళ్లారు. ఈక్రమంలో ఆయన లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆ తర్వాత చికిత్స పొందుతున్న తన తండ్రి పెద్దిరెడ్డిని పరామర్శించడానికి వెళ్తారు’ అని ఆయన చెప్పారు. ఆ వెంటనే MPని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.

error: Content is protected !!