News March 21, 2025
నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: మేయర్

నీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఖిలావరంగల్ మండలంలోని ఉర్సు, కరీమాబాద్ వాటర్ ట్యాంకర్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నీటి సరఫరాలో జాప్యంగల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చొరవ తీసుకోవాలని తెలిపారు. వాటర్ ట్యాంక్‌లో నీటి సరఫరా నిలిచిపోయిందని తన దృష్టికి రావడంతో ఇక్కడికి వచ్చానని అన్నారు.
Similar News
News April 24, 2025
నరసరావుపేట: కావ్యశ్రీని దత్తత తీసుకున్న కలెక్టర్

పదో తరగతిలో 590 మార్కులు సాధించిన కారంపూడి జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కావ్యశ్రీని జిల్లా కలెక్టర్ పి. అరుణ్‌బాబు బుధవారం దత్తత తీసుకున్నారు. పేద కుటుంబానికి చెందిన ప్రతిభావంతురాలైన కావ్యశ్రీ ఉన్నత చదువుకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఆమె తల్లిదండ్రులు రామయ్య, కోటేశ్వరమ్మ దంపతులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
News April 24, 2025
ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

ఖమ్మం జిల్లాలో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెనుబల్లిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు నేలకొండపల్లి, ఎర్రుపాలెం 42.9, ఖమ్మం(U), మధిర (సిరిపురం) 42.8, వైరా, ముదిగొండ (పమ్మి) 42.7, చింతకాని 42.6, కూసుమంచి, రఘునాథపాలెం 42.5, ఖమ్మం (R) పల్లెగూడెం 42.4, సత్తుపల్లి 42.2, తిరుమలాయపాలెం 41.8, వేంసూరు, ఏన్కూరు 41.4, కామేపల్లి (లింగాల) 41.0 నమోదైంది.
News April 24, 2025
వరంగల్‌లో గురువారం మెగా జాబ్ మేళా

వరంగల్ జిల్లాలో గురువారం మెగా జాబ్ మెళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని రజిత తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ములుగు రోడ్డు సమీపంలోని ఐటీఐ కళాశాలలో గల ఎంప్లాయిమెంట్ ఆఫీసుకు రావాలన్నారు. పూర్తి వివరాలకు 7093168464 సంప్రదించాలని కోరారు.