News August 5, 2024

నీట్ ఫలితాల్లో మెరిసిన ముదిగుబ్బ విద్యార్థి

image

ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన వెంకటేశ్ నాయక్ కుమారుడు గణేశ్ నాయక్ నీట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ సాధించారు. ఈ ఫలితాలను నిన్న డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థిని తల్లితండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు. గ్రామీణ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని విద్యార్థి గణేశ్ నాయక్ తెలిపారు.

Similar News

News September 15, 2024

అనంత: 195 బాల్స్‌కు 113 రన్స్ చేసిన రికీ భుయ్

image

అనంతపురం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా జరుగుతోంది. కాగా ఇండియా A & D టీమ్‌లు D టీమ్ బ్యాట్స్ మెన్ రికీ భుయ్ సెంచరీ చేశారు. 195 బాల్స్‌కు 113 రన్స్ చేసి ఔటయ్యారు. అభిమానులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఆదివారం కావడంతో క్రికెట్ అభిమానులు ఆర్డీటీ స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.

News September 15, 2024

ఓడీసీ: డాబా యజమాని ఆత్మహత్య

image

ఓడీసీ మండలం పరిధిలోని జరికుంటపల్లి గ్రామం వద్ద డాబా యజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. బంధువులు వివరాలు మేరకు శనివారం రాత్రి సుమారు 8:30గంటల సమయంలో డాబా యజమాని రమేష్ నిద్ర వస్తోందని భార్య కుమార్తెతో చెప్పి హోటల్ మేడపై ఉన్న గదిలోకి వెళ్లాడు. చాలా సేపు తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి చూడగాఫ్యాన్‌కు ఉరేసుకోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

News September 15, 2024

అనంతపురంలో 19న ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం

image

అనంతపురంలోని కలెక్టరేట్‌‌లో ఈ నెల 19న ఉదయం11 గంటలకు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌, హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో హంద్రీనీవా, మైనర్‌ ఇరిగేషన్‌తో పాటు హెచ్చెల్సీకి కేటాయించిన నీటి విడుదల తేదీలను ప్రకటిస్తామన్నారు. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.