News June 6, 2024

నీట్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులకు అభినందనలు: మంత్రి పొన్నం

image

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల సంస్థ విద్యార్థులు నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించి రికార్డు సృష్టించారు. 171 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా వారిలో 135 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇందులో 120 మంది బాలికలు, 15 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు 400లకు పైగా మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు విద్యార్థులకు మంత్రి పొన్నం అభినందనలు తెలిపారు.

Similar News

News December 10, 2024

మెదక్: ముసాయిదాపై అభ్యంతరాలుంటే ఈనెల 12లోపు తెలపాలి: కలెక్టర్

image

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 లోపు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో తెలియజేయాలన్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ రాజకీయ పార్టీలకు తెలిపారు.

News December 10, 2024

సంగారెడ్డి: మూడు నెలలకు ఒకసారి ఈవీఎంల పరిశీలన: కలెక్టర్

image

3నెలలకు ఒకసారి ఈవీఎంలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం పాత డీఆర్డీఏలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించినట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌లో సీసీ కెమెరాలు, విద్యుత్ లైట్లు, తదితర సౌకర్యాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈవీఎంలకు పోలీసుల భద్రత కల్పించినట్లు చెప్పారు.

News December 10, 2024

ఐదున్నర దశాబ్దాలకు ఆత్మీయ సమ్మేళనం

image

పటాన్‌చెరులో 1971-72లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 55ఏళ్లకు ఆత్మీయ అపూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. మాజీ కార్పొరేటర్ సపాన్ దేవ్ ఆధ్వర్యంలో పూర్వ స్నేహితులు (విద్యార్థులు) కలుసుకొని ఒకరినొకరు పలకరించుకొని ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయాలని అనుకున్నట్లు వివరించారు.