News September 4, 2024

నీలోఫర్ కేఫ్‌లో లేబుల్స్ లేని ఫుడ్స్

image

బంజారాహిల్స్‌లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నీలోఫర్ కేఫ్ కిచెన్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచిన షుగర్ సిరప్, మసాలా దినుసులు వంటి లేబుల్ లేని వస్తువులు చూసి అసహనం వ్యక్తం చేశారు. అమ్మకానికి ఉంచిన కేక్‌లను కూడా లేబుల్ చేయలేదు. దీంతో పాటు వంటగదిలో ఎక్స్పైరీ అయిన అరకిలో చీజ్, మిరప పొడి, 5 కిలోల కాల్చిన వేరుశెనగలు ఉన్నాయి.

Similar News

News November 28, 2025

HYD: మెగా కార్పోరేషన్‌గా జీహెచ్ఎంసీ

image

ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉన్న మున్సిపాలిటీల విలీనంతో GHMC మెగా కార్పోరేషన్‌గా అవతరించింది. కాగా కార్పోరేషన్‌ను 2 లేదా 3గా విభజించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్ని ముక్కలుగా విభజించాలనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. సంస్థాగత పునర్విభజన, కార్పొరేషన్ బట్టి ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందని టాక్.

News November 28, 2025

HYD: గడువు ముగిసిన తర్వాతే ‘విలీనం’ !

image

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుత గ్రేటర్ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ గడువు ముగిసిన తరువాతే సర్కారు జీఓను విడుదల చేయనున్నట్లు సమాచారం. విలీన నిర్ణయాన్ని పాలక మండలి ఆమోదించినా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ఆలస్యం చేయనున్నట్లు తెలిసింది.

News November 28, 2025

HYD: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

image

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన సామన్లు సర్దుకున్నట్లు టాక్. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.