News January 31, 2025
నీల్వాయి: అడవి పందిని వేటాడిన ముగ్గురి అరెస్టు

నీల్వాయి రేంజ్ పరిధిలోని కొత్తగూడెం సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి అడవి పందిని చంపిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపారు. నీల్వాయి గ్రామానికి చెందిన నర్వేల్లి మల్లయ్య, మంత్రి రాజన్న, గొర్లపల్లి గ్రామానికి చెందిన నికాడి నాగేష్ కొత్తగూడెం గ్రామానికి చెందిన నర్వెల్లి మల్లయ్య వరి పొలంలో విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి అడవి పందిని చంపినట్టు గుర్తించామన్నారు.
Similar News
News January 9, 2026
కామారెడ్డి జిల్లాలో రాత్రి ACCIDENT

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. లింగంపేట మండలం సూరాయిపల్లికి చెందిన కూలీలు వరినాట్లు వేసేందుకు ఆటోలో భిక్కనూర్ మండలం అంతంపల్లికి వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా జిల్లా కేంద్రంలో ముందున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News January 9, 2026
మంచిర్యాల: యాక్సిడెంట్.. డిగ్రీ విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లాలోని <<18794592>>మోకిల <<>>వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌కు చెందిన విద్యార్థి దుర్మరణం చెందారు. మంచిర్యాలకు చెందిన దేవుళ్ల సూర్యతేజ HYDలో డిగ్రీ చదువుతున్నాడు. స్నేహితుడి బర్త్ డే వేడుకలు జరుపుకొని కారులో తిరిగి వస్తుండగా బారికేడ్లను తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
News January 9, 2026
ఈనెల 15 నుంచి సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

కొల్లాపూర్ మండలంలోని సింగోటంలో ప్రసిద్ధి గాంచిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి 21 వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రధాన ఘట్టాల వివరాలు ఇలా ఉన్నాయి:
జనవరి 16: స్వామివారి కళ్యాణోత్సవం
జనవరి 18: సాయంత్రం 4 గంటలకు రథోత్సవం (తేరు)
జనవరి 19: రాత్రి 7 గంటలకు చెరువులో తెప్పోత్సవం
జనవరి 21: హంస వాహన సేవ
ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ కోరింది.


